పారాసెటమాల్ ఫార్ములేషన్స్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా విస్తరిస్తున్నప్పటికీ.. వాటిని ఎగుమతి చేసేందుకు వీలు కల్పించింది. అయితే.. పారాసెటమాల్ యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)లపై ఆంక్షలు కొనసాగుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) స్పష్టం చేసింది.
" నిర్ణీత పరిమాణంలోని ఉత్పత్తులు సహా పారాసెటమాల్ నుంచి తయారయ్యే ఫార్ములేషన్స్ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేశాం. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుంది."
- డీజీఎఫ్టీ
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలకు సరిపడా నిల్వ ఉంచే క్రమంలో 26 రకాల ఫార్మా ఉత్పత్తులు, ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం.
ఇదీ చూడండి: ఆర్థిక ఆరోగ్యానికీ వైరస్.. సమష్టి పోరుతోనే విజయం