ETV Bharat / business

అన్ని కార్లలోనూ ఎయిర్​బ్యాగ్స్- కొత్త రూల్స్ అప్పటినుంచే - when did airbags become mandatory in india

దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని కార్లలోనూ ఎయిర్​బ్యాగ్స్​ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2021 డిసెంబర్ 31వరకు వాయిదా వేసింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

airbags
ఎయిర్ బ్యాగ్స్
author img

By

Published : Jun 28, 2021, 2:04 PM IST

దేశంలో కొవిడ్-19 మహమ్మారి విజృంభణ క్రమంలో అన్ని కార్లలోనూ ఎయిర్​బ్యాగ్స్​ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను నాలుగు నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు 2021 డిసెంబర్ 31వరకు ఈ నిబంధనను వాయిదా వేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మార్కెట్​లోకి వచ్చే కార్లలో ఇవి కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించింది.

ఇప్పటివరకు డ్రైవర్​ సీటుకు మాత్రమే ఎయిర్​బ్యాగ్​ ఉండేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. 2021 ఏప్రిల్​ 1 తర్వాత ఉత్పత్తి చేసే కార్లలో కచ్చితంగా అన్ని సీట్లకు ఎయిర్​బ్యాగ్స్ ఉండాలని మార్చి 6న రవాణా శాఖ ఆదేశించింది.

అంతకుముందే మార్కెట్​లో ఉన్న మోడల్స్​ అయితే ఆగస్టు 31లోపు ఎయిర్​బ్యాగ్స్​ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి : శాంసంగ్​ కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్​- ధరెంతంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.