సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. నూతనంగా తీసుకొచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలను తక్షణమే అందజేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ విడుదల చేసిన నోట్లో పేర్కొంది.
మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాలు నియమించుకునే ఫిర్యాదు పరిష్కార అధికారి, నోడల్ అధికారి, కంప్లైయన్స్ అధికారుల పేర్లను సమర్పించాలని ఐటీ శాఖ కోరింది. యాప్ పేరు, వెబ్సైట్ సహా ముగ్గురు కీలక అధికారుల వివరాలు, సంస్థ చిరునామాలు అందించాలని స్పష్టం చేసింది.
పెద్ద సంస్థలన్నీ తమ స్పందనను వీలైనంత త్వరగా పంపించాలని, ఈరోజే(బుధవారం) పంపిస్తే మేలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి- ఓటీటీ, డిజిటల్ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే!