ETV Bharat / business

మార్కెట్​ గమనంపై కేంద్రం నిశిత పరిశీలన

కరోనా ప్రభావంతో కొద్దిరోజులుగా స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంపై కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్​ స్పందించారు. స్టాక్​మార్కెట్ల అస్థిరతను కేంద్రం, ఆర్​బీఐ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Govt and RBI closely monitoring markets
స్టాక్​ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం
author img

By

Published : Mar 13, 2020, 7:14 PM IST

కొద్దిరోజులుగా స్టాక్​ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయి. కరోనా భయాలే మార్కెట్ల ఒడుదొడుకులకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ప్రభుత్వం, ఆర్​బీఐ.. మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు.

పుంజుకున్న స్టాక్​ మార్కెట్లు​..

నిన్నటి సెషన్​లో పేకమేడలా కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు నేడు మళ్లీ లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్​ 1325 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 365 పాయింట్ల వృద్ధితో ట్రేడింగ్​ ముగించింది.

సెషన్​ ప్రారంభంలో స్టాక్​ మార్కెట్లు అతిపెద్ద ఇంట్రా డే నష్టాలను చవిచూశాయి. కేవలం 20 నిమిషాల్లోనే బీఎస్​ఈ మదుపరుల సంపద సుమారు రూ.12 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

12 ఏళ్ల తర్వాత తొలిసారి..

కరోనా భయంతో ఈ రోజు సెషన్​ ప్రారంభంలో సెన్సెక్స్​, నిఫ్టీ 10 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ కారణంగా ట్రేడింగ్​ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. 2008 జనవరి తర్వాత ట్రేడింగ్​ను ఇలా నిలిపివేయడం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: నష్టాల బాటలో విమానయాన రంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.