ఒప్పందంలో భాగంగా రిలయన్స్ జియోకు రూ. 33,737 కోట్లు చెల్లించింది టెక్ దిగ్గజం గూగుల్. ఫలితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ అయిన జియోలో 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియోలో పెట్టుబడులు పెట్టిన ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల జాబితాలో గూగుల్ కూడా చేరింది. అంతేకాకుండా భారతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద అమెరికా టెక్ సంస్థగా గూగుల్ అవతరించింది.
ఈ చెల్లింపులతో జియో ప్లాట్‌ఫాం విలువ రూ.1.52 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 11వారాల్లోనే 13 ఆర్థిక, వ్యూహాత్మక పెట్టుబడిదారులకు 33 శాతం వాటాను విక్రయించడం ద్వారా జియో ప్లాట్‌ఫాం విలువ ఇంత భారీ మొత్తంలో పెరిగింది. 2021 మార్చి నాటికి తన నికర రుణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యానికి రిలయన్స్ చేరుకోవడానికి ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి.
గూగుల్, జియో సంస్థలు సంయుక్తంగా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నట్లు జులైలో ఓ ప్రకటన చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి త్వరలోకి తీసుకురానున్నాయి.
ప్రస్తుతం 4 కోట్ల చందాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది జియో.
ఇదీ చూడండి: ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేస్తే '0' చేర్చాల్సిందే!