ETV Bharat / business

గూగుల్​ పేలో కొత్త ఫీచర్.. వాయిస్​తో పేమెంట్​! - google pay industry first And a fist for gloabally

ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే'.. భారత్​లో వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను(Google pay new features india) తీసుకురానున్నట్లు ప్రకటించింది. మాట్లాడి పేమెంట్ చేసే విధంగా స్పీట్​ టు టెక్స్ట్​ ఫీచర్​ను తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ(Google pay news) తెలిపింది. అలాగే.. యాప్​లో హింగ్లీష్ భాష సదుపాయాన్ని తీసుకురానున్నట్లు చెప్పింది.

google pay new features
గూగుల్​పేలో కొత్త ఫీచర్లు
author img

By

Published : Nov 18, 2021, 7:38 PM IST

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్​కు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే'(Google pay) భారత్​లో సరికొత్త ఫీచర్లను(Google pay new features india) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా.. స్పీచ్ టు టెక్స్ట్(Voice payment)​ ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు(Google pay news) తెలిపింది. యాప్​లో హింగ్లీష్(హిందీ ఇంగ్లీష్​ కలిసి) భాషను ఎంచుకునేందుకు "ఇండస్ట్రీ ఫస్ట్​ అండ్​ ఏ ఫస్ట్ ఫర్ గ్లోబల్లీ ఫీచర్"​ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది.

"డబ్బులను చెల్లించే ప్రక్రియను సులభతరం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా.. ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆర్థిక అవకాశాలను మేం సృష్టిస్తున్నాం. అది మా బ్యాంకులైనా, మా భాగస్వాములైనా కావచ్చు. భారత్​లో డిజిటల్ చెల్లింపుల(Gpay india) విషయంలో మేం పోషిస్తున్న పాత్రకు సంతోషిస్తున్నాం."

-అంబరీశ్ కెంఘే, గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్​

"డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు 'హింగ్లీష్' భాషను ఎంచుకునేందుకు వీలుగా.. 'ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ ఏ ఫస్ట్ ఫర్ గూగుల్ గ్లోబల్లీ' ఫీచర్​ను తీసుకువస్తున్నాం. ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారులు సులభంగా మా యాప్​ను వాడగలరు" అని అంబరీశ్​ పేర్కొన్నారు.

స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్​తో(Voice payment​) మాటల ద్వారా గూగుల్​పేలో కావాల్సిన ఖాతా నంబర్​కు పేమెంట్​ చేయొచ్చని అంబరీశ్ తెలిపారు. టైప్ చేసి పేమెంట్​ చేసేటప్పుడు ఎలాంటి భద్రత అయితే ఉంటుందో.. స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్​తోనూ అంతే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. గ్రూపులుగా చెల్లింపులు చేసినప్పుడు బిల్లులను విభజించే సదుపాయాన్ని కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.

కోటికిపైగా వ్యాపారులు(Gpay india) గూగుల్​ పేను వినియోగిస్తున్నారని(Google pay business) అంబరీశ్​ తెలిపారు. ప్రతిరోజు కొత్త వ్యాపారులు గూగుల్​ పేలో చేరుతున్నారని చెప్పారు. మైషాప్​ ఫీచర్​.. వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 7వ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్​లో పాల్గొన్న ఆయన ఈ ఫీచర్లను(Google pay new features india) ప్రకటించారు.

ఇవీ చూడండి:

గూగుల్ పే నయా ఫీచర్​.. యాప్​ నుంచే ఫిక్స్​డ్ డిపాజిట్లు!

గూగుల్ పేలో ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పాలసీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.