ETV Bharat / business

గూగుల్ మ్యాప్స్​ కొత్త ఫీచర్లతో ప్రయాణం మరింత సులభం! - గూగుల్ మ్యాప్స్​

గూగుల్ మ్యాప్స్ ప్రారంభమై 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా కొత్తగా 14 ఫీచర్లు తీసుకొచ్చింది ఆ టెక్ దిగ్గజం. భారత్​లో ఆండ్రాయిడ్ ప్లాట్​ఫాంలోని గూగుల్ మ్యాప్స్​లో 'మిక్స్​డ్​ మోడ్ కమ్యూట్ ఆప్షన్'​ ప్రయాణ సాధనాల ఎంపికను పొందుపరచాలని నిర్ణయించింది.

Google to expand mix mode commute option in maps to more Indian cities
గూగుల్​ మ్యాప్స్​లో 15 కొత్త ఫీచర్లు
author img

By

Published : Feb 7, 2020, 3:45 PM IST

Updated : Feb 29, 2020, 12:57 PM IST

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్... ఆండ్రాయిడ్ ప్లాట్​ఫామ్​లోని తన మ్యాప్​ల్లో వివిధ ప్రయాణ సాధనాల ఎంపికలను (మిక్స్​డ్​​ మోడ్ కమ్యూట్ ఆప్షన్స్​) పొందుపరచాలని నిర్ణయించింది. దీని ద్వారా వాహనాల రాకపోకలను వినియోగదారులు మరింత తేలికగా తెలుసుకోగలుగుతారు. రవాణా సాధానాల్లో తమకు అనువైనదాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది.

గూగుల్​ మ్యాప్స్​లో ఇప్పటివరకు రైలు, బస్సు, సొంత వాహనం, ద్విచక్రవాహనం... ఇలా వేర్వేరు వాహనాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాల్ని తెలుసుకునే వీలుంది. మిక్స్​డ్​ మోడ్​లో... ఎక్కడి వరకు ఏ వాహనంలో వెళ్లాలో, ఆ తర్వాత ఏ వాహనం ఎక్కాలో తెలుస్తుంది.

ప్రస్తుతం దిల్లీ, బెంగళూరులో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. త్వరలోనే మిగతా నగరాలకు అందుబాటులోకి రానుంది. గూగుల్ మ్యాప్స్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జెన్​ ఫిట్జ్​పాట్రిక్ ఈ విషయాలను వెల్లడించారు.

"ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మ్యాప్స్​లో పబ్లిక్ ట్రాన్స్​పోర్టు ట్యాబ్​ ఉంది. ఇందులో ప్రజా రవాణా, ఆటోరిక్షాల సమాచారం ఉంటుంది. వినియోగదారులు ఏ స్టేషన్​లో వాహనాన్ని బుక్​ చేసుకోవాలో, ఎక్కడ దిగాలో తెలుపుతుంది. అలాగే ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియజేస్తుంది."- జెన్​ ఫిట్జ్​పాట్రిక్, గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్

భారత్​ ప్రేరణతో

జెన్ ఫిట్జ్​ప్యాట్రిక్ గూగుల్ మ్యాప్స్​లో పొందుపరిచిన 14 ఫీచర్స్​ను వివరించారు. వీటిలో ఎనిమిది మొదట భారత్​లో ప్రారంభించినట్లు తెలిపారు. వీటిలోనూ ఆరు భారతదేశం నుంచి ప్రేరణ పొందే రూపొందించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఫీచర్లను విదేశీ మార్కెట్లలో అమలుచేసినట్లు ఆమె పేర్కొన్నారు.

టాయిలెట్స్ చింత లేదు

ప్రజామరుగుదొడ్లు గురించిన సమాచారం స్వచ్ఛ భారత్​ మిషన్​ నుంచి ప్రేరణ పొంది రూపొందించామని జెన్ స్పష్టం చేశారు. 'ప్లస్ కోడ్​' అనే డిజిటల్ చిరునామా ద్వారా లొకేషన్​ షేరింగ్​, అలాగే వివిధ రవాణా సాధానాల రాకపోకలు గురించి తెలుసుకోవచ్చన్నారు.

గూగుల్ మ్యాప్స్​లో ఇప్పుడు భారత్​లోని 2,300 ప్లస్ నగరాల్లోని 57,000 ప్రజా మరుగుదొడ్ల జాబితా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో 2016లో దిల్లీ, భోపాల్​, ఇండోర్ నగరాల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్​గా చేపట్టారు.

ఇదీ చూడండి: పబ్లిక్ క్లౌడ్​తో.. 100 బిలియన్​ డాలర్లు, 2.4 లక్షల ఉద్యోగాలు!

Last Updated : Feb 29, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.