రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు ఛైర్మన్ ముకేశ్ అంబానీ. గూగుల్- జియో సంయుక్తంగా జియోఫోన్ నెక్ట్స్ అనే స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు.
వినాయకచవితి సందర్భంగా.. సెప్టెంబర్ 10న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్, జియో అప్లికేషన్లన్నింటికీ వర్తించేలా, ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. 5జీ కోసం గూగుల్ క్లౌడ్‌ను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో భారత్‌లోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలుస్తుందని అన్నారు అంబానీ.
జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లివే..
- వాయిస్ అసిస్టెంట్
- రియాలిటీ ఫిల్టర్స్‌తో స్మార్ట్ కెమెరా
- లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్
ఇదీ చదవండి: 'సంస్థ వృద్ధి కన్నా.. సేవా కార్యక్రమాలతోనే తృప్తి'