ETV Bharat / business

వొడాఫోన్​ ఇండియాలో గూగుల్​ వాటాల కొనుగోలు! - Vodafone assets to bought google

వొడాఫోన్​ ఇండియాలో గూగుల్ వాటాలు కొనుగోలు చేయనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ బకాయిలు చెల్లించలేక ఆర్థికంగా డీలాపడింది వొడాఫోన్​ ఇండియా. అయితే ఈ విషయంపై రెండు సంస్థల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Google eyeing Vodafone Idea stake: Report
వొడాఫోన్​ ఇండియాను ఆదుకునేదిశగా గూగుల్​ సన్నాహం
author img

By

Published : May 28, 2020, 9:59 PM IST

ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫాబెట్‌ సంస్థ వొడాఫోన్ ఇండియాలో 5 శాతం వాటాను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ వెల్లడించింది.

వొడాఫోన్ ఇండియాలో.. బ్రిటీష్‌ టెలికాం సంస్థ వొడాఫోన్​కు 45 శాతం వాటా ఉంది. వొడాఫోన్ ఇండియా లిమిటెడ్​(వీఓఎల్​).. ప్రభుత్వానికి 58 వేల కోట్ల రూపాయలు బాకీపడి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కంపెనీని మూసివేయాల్సి వస్తుందని గతంలోనే వొడాఫోన్​ ఐడియా ఛైర్మన్​ కుమార్​ మంగళం బిర్లా వెల్లడించారు.

ఈ తరుణంలో తమ కంపెనీ వాటాలు విక్రయించే అంశాన్ని వొడాఫోన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సంస్థలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

రిలయన్స్​ జియోలో.. ఫేస్​బుక్​!

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్.. రిలయన్స్‌ జియోలో ఇటీవలే వాటాలు కొనుగోలు చేసింది. గూగుల్ కూడా అదే బాటలో పయనించి.. వొడాఫోన్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేసే అంశంపై దృష్టి సారించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: 'మోదీ జీ.. మాకు రూ.50 వేల కోట్ల సాయం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.