ETV Bharat / business

గూగుల్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు అదనపు వీక్‌ ఆఫ్‌ - alternate day week off for employees google

గూగుల్‌ తమ ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు మరొక రోజును వీక్‌ ఆఫ్‌గా ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు గూగుల్ ఈ‌ అవకాశం కల్పించినట్లు ఓ నివేదిక పేర్కొంది.

google alternate day week off for employees
గూగుల్‌ ఉద్యోగులకు అదనపు వీక్‌ ఆఫ్‌
author img

By

Published : Sep 5, 2020, 8:37 PM IST

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో చాలా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అవకాశాన్ని కల్పించాయి. సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సాధారణంగా రెండు రోజుల వీక్‌ఆఫ్‌ ఉంటుంది. దాదాపుగా ఆరు నెలల నుంచి గూగుల్‌ సంస్థ కూడా తమ సిబ్బందికి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’కల్పించింది. అయితే తాము ఎక్కువగా బయటకు వెళ్లలేకపోవడం, శారీరక వ్యాయామం చేయలేకపోతున్నామని ఉద్యోగులు భావిస్తున్నారు. కొన్నిసార్లు తమ వ్యక్తిగత సమయంలోనూ కార్యాలయ పనిని చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు కాల్స్‌ కోసం అందుబాటులో ఉండాల్సి వస్తోందంటున్నారు. ఆఫీస్‌లో అయితే భోజన విరామం కోసం సమయం కేటాయించేవారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు అలా వీలు కావడం లేదని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొంతమందికి ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండానే పనిదినాలు, పని గంటలు పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. పని, వ్యక్తిగత జీవితం మధ్య ఒత్తిడికి గురవుతున్నామని, నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గూగుల్‌ తమ ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు మరొక రోజును వీక్‌ ఆఫ్‌గా గూగుల్‌ ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు గూగుల్‌ అవకాశం కల్పించినట్లు ఓ నివేదిక పేర్కొంది. శుక్రవారం రోజును సంస్థలోని శాశ్వత, శిక్షణ పొందుతున్న తాత్కాలిక సిబ్బందికి వీక్‌ఆఫ్‌గా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఆ రోజు ఎవరైతే పని చేస్తారో వారు మరొక రోజును సెలవుగా తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. డే ఆఫ్‌ను కల్పించడంలో మేనేజర్లు తమ బృందం సభ్యులకు మద్దతుగా నిలవాలని కంపెనీ సూచించింది. గూగుల్‌ నిర్ణయంతో ఇతర సంస్థల ఉద్యోగులు కూడా తమకు అలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతుండటం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.