ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలనుకున్న బ్యాంకు సమ్మె వాయిదా పడింది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సానుకూలంగా స్పందించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.
ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) అధికారిక ప్రకటన చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం 15 శాతం వేతన పెంపు, ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ సానుకూలంగా స్పందించిందని యూఎఫ్బీయూ తెలిపింది.
ఇదీ చూడండి:క్రూడ్ తగ్గింది... పెట్రో తగ్గదేం?