బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.679 తగ్గి.. రూ. 44,760కు దిగొచ్చింది.
పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.1,847 తగ్గి రూ.67,073కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,719 డాలర్లు, వెండి ధర 26.08 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి : కాసేపట్లో పోస్ట్‌మార్టమ్.. అంతలోనే కదలిక!