బంగారం ధరల వృద్ధికి నేడు అడ్డుకట్టపడింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.232 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,486కి చేరింది.
దేశీయంగా డిమాండు లేమికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం పసిడి ధర తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధర భారీగా క్షీణించినా వెండి మాత్రం స్వల్పంగా.. రూ.7 తగ్గింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.45,189కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,470 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.93 డాలర్ల వద్ద ఉంది.