బంగారం ధర సోమవారం భారీగా రూ.460 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,371 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గుతున్న కారణంగా దేశీయంగా ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ వార్తలతో బంగారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.629 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,469 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు తగ్గింది. వెండి ధర 23.82 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:9 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం