పసిడి, వెండిపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు బడ్జెట్ 2021-22లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,324 తగ్గి.. రూ.47,520 వద్దకు చేరింది.
వెండి ధర మాత్రం భారీగా రూ.3,461 పెరిగింది. కిలోకు ధర రూ.72,470 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,871 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 29.88 డాలర్లుగా ఎగిసింది.
ఇదీ చూడండి:బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు