బంగారం ధర మంగళవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.36 ఎగిసి.. రూ.49,610 వద్దకు చేరింది.
పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.36 పెరిగి.. కిలో వెండి రూ.68,156కు ఎగబాకింది.
"అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల సహా డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు పుంజుకుంటున్నాయి" అని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,883 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 26.26 డాలర్లు పలుకుతోంది.
ఇదీ చూడండి: రెండో రోజూ బుల్ జోరు- సరికొత్త శిఖరాలకు సూచీలు