బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.4 పెరిగి.. రూ.40,748కి చేరింది.
రూపాయి బలహీనపడటము, అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్‌తో.. దేశీయంగా ధరలు వృద్ధి చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.7(దిల్లీలో) పెరిగి.. రూ.47,863 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,560 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.05 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:'70% పేదలకంటే ఒక శాతం ధనికుల సంపదే ఎక్కువ'