బంగారం ధర బుధవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి అతి స్వల్పంగా రూ.3 పెరిగి.. రూ.50,014 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు తగ్గట్లు దేశీయంగానూ పసిడి అస్థిరతను ఎదుర్కొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా కిలోకు రూ.451 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,023 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర స్వల్పంగా పెరిగి 1,877 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 24.20 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ఉంది.