పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.6 పెరిగి రూ.42,958కు చేరుకుంది. వెండి ధర మాత్రం రూ.58 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో రూ.46,213గా ఉంది.
రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,595 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 16.73 డాలర్లుగా ఉంది.
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సహా ఇతర కేంద్ర బ్యాంకులు కూడా సరళీకృత ద్రవ్యవిధానాల వైపు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో బంగారం ధరలు పెరిగాయని తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 479 పాయింట్లు వృద్ధి