బంగారం ధర సోమవారం కూడా స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.277 ఎగిసి.. రూ.52,183 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి డిమాండ్ ఇటీవల భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా దేశీయంగాను పుత్తడి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ రెండో దశ విజృంభణ భయాలతో పెరుగుతున్న కొనుగోళ్లు కూడా బంగారం ధరల్లో వృద్ధికి కారణమని అంటున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.694 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,699 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,960 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.75 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:మార్కెట్లకు కొత్త 'జో'రు- జీవనకాల గరిష్ఠాలకు సూచీలు