కొన్ని రోజులుగా తగ్గతూ వచ్చిన పసిడి, వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.45 ఎగిసి.. రూ.48,273 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి ధర కూడా మంగళవారం కిలోకు(దిల్లీలో) రూ.407 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.59,380 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,812 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 23.34 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: మార్కెట్లలో లాభాల జోరు- 13,100పైకి నిఫ్టీ