బంగారం ధర మరింత ప్రియమైంది. 10 గ్రాముల పుత్తడి ధర గురువారం దిల్లీలో రూ.881 పెరిగి.. రూ.44,701 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికవరీ అవుతుండటం వల్ల.. దేశీయంగానూ బంగారం ప్రియమవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర భారీగా రూ.1,071 పెరిగింది. దీనితో కిలో ధర ప్రస్తుతం రూ.63,256 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,719 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సు 24.48 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:వెండిపై పెట్టుబడికి ఇదే సరైన సమయమా?