బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.587 పెరిగి.. రూ.45,768 వద్దకు చేరింది.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు భారీగా రూ.682 పెరిగి.. రూ.65,468 వద్దకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గటం వల్ల పసిడి ధరలు ఈ స్థాయిలో పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,739 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 25.04 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.
ఇదీ చదవండి:ఆర్బీఐ ప్రకటనతో మార్కెట్లకు జోష్