పండుగ సీజన్ తర్వాత బంగారం ధర ఒడుదొడుకుల్లో కొనసాగుతోంది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర.. నేడు స్వల్పంగా పెరిగింది.
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.87 వృద్ధితో.. రూ.38,842కి చేరింది. రూపాయి క్షీణించడం, అంతర్జాతీయ సానుకూలతలు.. ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కిలో వెండి ధర (దిల్లీలో) నేడు రూ.450 పెరిగి.. రూ.47,220 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,489.50 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.82 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: వచ్చే ఏడాది శాంసంగ్ మడత ఫోన్-2.0!