పసిడి మళ్లీ పరుగు పెడుతోంది. ఇటీవల ధర కాస్త తగ్గినా.. తిరిగి నెమ్మదిగా పుంజుకుంటోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.181 వృద్ధితో.. రూ.39,395కి చేరింది.
అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో పసడిపై పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా ధరలు పెరగుతూ వస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కిలో వెండి ధర (దిల్లీలో) నేడు రూ.270 పెరిగి.. రూ.47,900 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర అత్యధికంగా 1,513 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.13 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: అక్టోబర్‌లోనూ నిరాశపరిచిన జీఎస్టీ వసూళ్లు