తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 తగ్గి.. రూ.49,400కు చేరింది. కానీ కిలో వెండి ధర (Silver price today)రూ.437 మేర పెరిగి.. రూ.65,030కి ఎగబాకింది.
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,030 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,400గా ఉంది. కిలో వెండి ధర రూ.65,030 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,030 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,794. డాలర్లుగా ఉంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.41 డాలర్లు పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
- హైదరాబాద్లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చూడండి: Fuel price reduction: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!