తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర శుక్రవారం రూ.560 పెరిగి.. రూ.49,130కి చేరింది. వెండి ధర రూ.1738 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,875గా ఉంది.
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,130గా ఉంది. కిలో వెండి ధర రూ.65,875 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,130 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.65,875కి చేరింది.
- విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,130గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,875 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,794 డాలర్లుగా ఉంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.84 డాలర్లు వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.94.61 వద్ద ఉంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్కు రూ.110.33 కాగా.. డీజిల్ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.17గా ఉంది.
ఇదీ చూడండి : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఖజానాపై భారం ఎంతంటే?