బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం భారీగా రూ.714 తగ్గి.. రూ.50,335 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా బంగారానికి తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగాను పసిడి ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.386 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,708 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.07 డాలర్ల వద్ద ప్లాట్‌గా ఉంది.
ఇదీ చూడండి:రెండో రోజూ నష్టాలు- ఐటీ, ఎఫ్ఎంసీజీ బేజారు