పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.96 పెరిగి రూ.40,780గా ఉంది. కిలో వెండి ధర రూ.238 పెరిగి రూ.47,277గా ఉంది.
కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,558 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.80 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: అంతర్జాతీయ సానుకూలతలతో చివరకు లాభాలు