పసిడి, వెండి ధరలకు సోమవారం రెక్కలొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.905 పెరిగి... రూ. 52,960కి చేరుకుంది. కిలో వెండి మీద రూ. 3,347 ఎగబాకి... రూ.65,670కు చెేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,935 డాలర్లు పలకగా... ఔన్స్ వెండిపై 24 శాతం పెరిగింది.
ఆర్థిక మందగమనం, పురోగతిపై ఆందోళనలు బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమైతే... చైనా-అమెరికా సంబంధాలు క్షీణించడం వల్ల కూడా పసిడి ధరలకు రెక్కలొచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: చమురు సంస్థల్లో రిలయన్స్ వరల్డ్ నంబర్ 2