బంగారం ధర మంగళవారం రూ.102 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.49 వేల 228 వద్ద నిలిచింది.
వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో రూ.249 క్షీణించి రూ.50 వేల 573 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకు 1,781 యూఎస్ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 18.08 యూఎస్ డాలర్లుగా ఉంది.