ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశ బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన పసిడి మాత్రమే దిగుమతి అయినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19లో ఇదే సమయంలో 24.73 బిలియన్ డాలర్ల విలువైన పసిడి భారత్‌కు దిగుమతి అయ్యింది.
వాణిజ్య లోటు తగ్గింది
బంగారం దిగుమతుల క్షీణత వల్ల దేశ వాణిజ్య లోటు 118 బిలియన్ డాలర్లకు తగ్గేందుకు దోహదపడింది. గతేడాది 148.23 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. 2019 జులై-సెప్టెంబర్‌లో సీఏడీ... స్థూల జాతీయోత్పత్తిలో 0.9 శాతానికి లేదా 6.3 బిలియన్ డాలర్లకు తగ్గింది.
గతేడాది అక్టోబర్- నవంబర్ మధ్య బంగారం దిగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. డిసెంబర్లో మాత్రం కేవలం 4 శాతానికి పరిమితమయ్యాయి. కానీ ఈ ఏడాది జులై నుంచి బంగారం దిగుమతులు బాగా తగ్గాయి.
పసిడి దిగుమతి వల్ల..
భారత్ అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం. ఏటా 800-900 టన్నుల మేర పసిడి దిగుమతి అవుతుంది. ఇది ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీరుస్తుంది.
అధిక బంగారం దిగుమతుల వల్ల దేశానికి వాణిజ్యలోటు, కరెంట్ ఖాతా లోటు పెరిగిపోతుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.
అయితే ఈ అధిక సుంకం కారణంగా ఆభరణాల పరిశ్రమ రంగంలోని వ్యాపారాలు తమ తయారీ సంస్థలను పొరుగుదేశాలకు మారుస్తున్నారని ఆ పరిశ్రమకు చెందిన నిపుణులు చెబుతున్నారు.
సుంకాలు తగ్గించాలి!
పసిడి దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) కోరింది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.4 శాతం క్షీణించి, 27.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: పద్దు 2020: 'ఆడీ' అడిగినట్లు కేంద్రం చేస్తుందా?