అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.239 పెరిగి రూ. 49,058కి చేరింది.
కిలో వెండిపై గరిష్ఠ స్థాయిలో రూ.845 పెరిగి.. రూ. 49,300కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకు 1,764 యూఎస్ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.81 యూఎస్ డాలర్లుగా ఉంది.