బంగారం, వెండి ధరలు బుధవారం మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.110 పెరిగి.. రూ.46,396 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ధరలు రికవరీ అవుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర (Silver price today) కూడా రూ.324 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.66,864 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,783 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.94 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:'వృద్ధిరేటు 9.6 శాతానికే పరిమితం!'