పసిడి ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.35 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,503కు చేరింది.
రూపాయి బలపడుతుండటం, స్టాక్ మార్కెట్ల జోరు పసిడి ధర తగ్గుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
పుత్తడి ధర తగ్గినా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో)రూ.147 పెరిగి.. రూ.45,345 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,159 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 17.02 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:జీఎస్టీ చెల్లించేవారికి కేంద్రం లాటరీ పథకం!