ETV Bharat / business

గోల్డ్​ ఈటీఎఫ్​లలో పెట్టుబడి లాభాలు తెలుసా? - వ్యాపార వార్తలు

మదుపు చేయాలనుకునే వారికి అన్ని రకాల పెట్టుబడి సాధనాల్లో బంగారం ఉత్తమైమనదిగా, సురక్షితమైనదిగా నిపుణులు చెబుతుంటారు. అయితే భౌతికంగా కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టడం కన్నా.. ఈటీఎఫ్​ల రూపంలో పెట్టుబడి మేలని వారు సూచిస్తుంటారు. మరి గోల్డ్ ఈటీఎఫ్​ల రూపంలో పెట్టుబడితో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

WHAT IS GOLD ETFS
గోల్డ్ ఈటీఎఫ్​ల అంటే ఏమిటి
author img

By

Published : Mar 7, 2020, 6:11 AM IST

సాధారణంగా బంగారం కొనాలంటే దుకాణానికి వెళ్లి తీసుకుంటాం. ఇలా భౌతికంగా కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే ఉన్న మరో మార్గమే ఈటీఎఫ్​లు.

భారతీయులకు బంగారం ఎంతో ఇష్టమైన లోహం. గందరగోళ పరిస్థితులున్నప్పుడు వివిధ దేశాలు దీని ఆధారంగానే లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువకు కూడా ఆధారం అదే.

గోల్డ్ ఈటీఎఫ్​లు అంటే?

ఈటీఎఫ్ అంటే ఎక్స్ఛేంజ్​ ట్రేడెట్ ఫండ్. ఒక్కో ఈటీఎఫ్ ఒక్కో రకమైన పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. ఇవి సాధారణ షేర్ల లాగే స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్​లు ప్రధానంగా బంగారంలో పెట్టుబడి పెడుతుంటాయి. వీటి గమనానికి మొత్తం ఆధారం బంగారమే. బంగారం ధర పెరిగితే పెరుగుతుంటాయి, తగ్గితే తగ్గుతుంటాయి.

ఈటీఎఫ్​లు, భౌతికంగా కొనుగోలు ఏది బెటర్..

భౌతికంగా బంగారం కొన్నట్లయితే ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు పన్ను భారం కూడా పడుతుంది. కొన్ని రోజులకు తరుగు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నింటి భారం గోల్డ్ ఈటీఎఫ్​లలో ఉండదు.

ఈ కారణంగానే భౌతిక రూపంలో కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ ఈటీఎఫ్​లు మంచి ప్రత్యామ్నాయం. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి.

ప్రయోజనాలు...

ఈ ఈటీఎఫ్​లను ఖచ్చితమైన ధరలకు కొనుగోలు చేయొచ్చు. అదనపు ఛార్జీలు ఉండవు. గోల్డ్ ఈటీఎఫ్​లలో తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వీటిని అమ్మి డబ్బులు పొందవచ్చు. అంతేకాకుండా భౌతికంగా బంగారానికి కావాల్సిన లాకర్ లాంటివి దీనికి అవసరం లేదు.

సాధారణంగా స్టాక్ మార్కెట్​లలో లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్స్ ఉంటాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్​లకు కూడా వర్తిస్తాయి.

గోల్ట్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్లు

గోల్ట్ ఈటీఎఫ్​ల ఆధారంగా మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్ల నికర ఆస్తుల విలువ (ఎన్​ఏవీ).. ఆయా ఈటీఎఫ్​లపై ఆధారపడి ఉంటుంది. సాధారణ మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది.

ఇదీ చూడండి:ప్రతి 10మంది మహిళల్లో 8మందికి ఫోన్లో వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.