బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.128 తగ్గి.. రూ.41,148కి చేరింది.
కరోనా భయాలు వీడి పెట్టుబడిదారులు తిరిగి స్టాక్ మార్కెట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పసిడికి డిమాండ్ కాస్త తగ్గింది. ఈ కారణంగానే ధరలు దిగొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా ధరలు తగ్గడమూ దేశీయంగా ప్రభావం చూపుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.700 (దిల్లీలో) క్షీణతతో.. రూ.46,360 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,562.5 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.51 డాలర్లుగా ఉంది.