బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480 తగ్గి.. రూ.47,702 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గిన కారణంగా.. దేశీయంగానూ బంగారం ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర ఏకంగా కిలోకు రూ.3,097 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.70,122 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,847 డాలర్లకు తగ్గింది. వెండి ధర 27.50 డాలర్లకు దిగొచ్చింది.
ఇదీ చూడండి:బడ్జెట్ ఉత్సాహం- 6 రోజుల నష్టాలు 2 సెషన్లలో రికవరీ!