అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరల దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.232 తగ్గి రూ.47,387కు చేరింది.
కిలో వెండి ధర ఏకంగా రూ.1,955 తగ్గి.. రూ.67,605గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,835 డాలర్లు, వెండి ధర 26.78గా ఉంది.
డాలర్ బలోపేతం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు.. బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ వివరించారు.
ఇదీ చదవండి:మార్కెట్లు కొత్త రికార్డు- 50,250 పైకి సెన్సెక్స్