బంగారం ధర మంగళవారం అతి స్వల్పంగా రూ.9 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.46,900 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ పవనాలతో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.95 పెరిగి రూ.69,530 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,821 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.60 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.