పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 32 తగ్గి... రూ. 51,503కు చేరింది.
వెండి కూడా పుత్తడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ. 626 క్షీణించి రూ.62,410గా చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ భారీగా తగ్గడమే.. దేశంలో ధరల క్షీణతకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,901 డాలర్లు పలకగా... వెండి 24.18 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: కుప్పకూలిన మార్కెట్లు- సెన్సెక్స్ 1,066 పాయింట్లు డౌన్