బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం.. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.116 పెరిగి రూ.39,630గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,504 డాలర్లకు చేరింది.
అంతర్జాతీయ ప్రభావంతో పాటు వివాహాది శుభకార్యాల కోసం 24 క్యారెట్ల బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ అనలిస్ట్ (కమొడిటీస్) తపన్ పటేల్ చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో
కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.454 పెరిగి రూ.48,060గా ఉంది. ఔన్స్ వెండి ధర 17.94 డాలర్లకు పెరిగింది.
రాజకీయ అనిశ్చితులు, క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులు ఉండటం.. 2020 ప్రారంభంలో ఈక్విటీ సూచీలు లాభపడతాయనే అంచనాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తపన్ తెలిపారు.
ఇదీ చూడండి: ఎఫ్ అండ్ ఓ గడువు ముగిసింది.. మార్కెట్ నష్టపోయింది