దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వైరస్ కొత్త రకం ప్రభావం, వ్యాక్సిన్ వార్తలు ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ నెల డెరివేటివ్స్ ముగియనున్న నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని అంటున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలు లేనందున.. ఈ వారానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకంగా మానున్నట్లు అభిప్రాయడుతున్నారు.
అంతర్జాతీయంగా.. కరోనా వ్యాక్సిన్ వార్తలు, బ్రెగ్జిట్ ఒప్పందం వంటివి మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తుది గడువులోపే ఐరోపా సమాఖ్యతో బ్రిటన్ చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడం కూడా కలిసొచ్చే అంశమంటున్నారు.
కరోనా కొత్త రకం విజృంభణ భయాల నేపథ్యంలో మదుపరులు క్వాలిటీ సెక్టార్లపై దృష్టి సారించే వీలుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కుడా వీరి సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశమని చెబుతున్నారు.
వీటితో పాటు.. రూపాయి, ముడి చమురు కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:కిరాణా కొట్లు.. ఐటీకి మెట్లు