స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా 2020-21 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్-చైనా సరిహద్దు వివాదం, అంతర్జాతీయ మార్కెట్ల పయనం వంటి వాటిపై మదుపరులు దృష్టి సారించొచ్చని చెబుతున్నారు.
ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ వారమే క్యూ1 ఫలితాలు ప్రకటించనుంది. హెవీ వెయిట్ షేర్లలో టీసీఎస్ కూడా ఒకటైనందున మార్కెట్లపై ఆ ఫలితాల ప్రభావం భారీగా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు నిపుణులు.
ఐఐపీ డేటా వంటి మాక్రో ఎకానమిక్ గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఇవి కూడా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే వీలుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండం వంటి పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని మార్కెట్ బ్రోకర్లు అంటున్నారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ, ముడిచమురు ధర వంటివి మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:పిల్లలకు ల్యాపీలిద్దాం.. సెల్‌ఫోన్ కంటే ఇదే మేలేమో!