ETV Bharat / business

ఇకపై హైదరాబాద్​లో ఆ కీలక డ్రగ్​ తయారీ..! - Remdesivir in india

కొవిడ్‌-19 చిక్సితలో కీలకంగా వినియోగిస్తున్న 'రెమిడెసివిర్‌' ఔషధ తయారీకి భారత్​లోని మూడు సంస్థలకు అనుమతులు లభించాయి. గిలీడ్​ సైన్సెస్​ ఈ మేరకు ఆయా తయారీదారులతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Gilead Sciences
కరోనా వ్యాక్సిన్​లో​ కీలక డ్రగ్​ 3 భారతీయ సంస్థల్లో తయారీ
author img

By

Published : May 13, 2020, 4:19 PM IST

కరోనా వైరస్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం 'రెమిడెసివిర్‌'ను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ ముందడుగు వేసింది. ఈ ఔషధం తయారీ, విక్రయాల్లో మూడు భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములుగా చేర్చుకుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది గిలీడ్‌ సైన్సెస్‌. ఇందులో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న హెటిరో ల్యాబ్స్​, నోయిడాలో ఉన్న జుబిలెంట్​ లైఫ్​ సైన్సెస్ ఉన్నాయి.

ఉపయోగమేంటి?

ఈ లైసెన్సింగ్‌ ఒప్పందం ద్వారా ఈ మూడు సంస్థలకు గిలీడ్‌ నుంచి సాంకేతికత బదిలీ అవుతుంది. సంబంధిత దేశాల్లో కొవిడ్‌-19 రోగులకు 'రెమిడెసివిర్‌' ఔషధం వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు, ఆయా దేశాల నియంత్రణ సంస్థల ఆమోదంతో ఉత్పత్తి పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇప్పటికే ఈ మందును కొవిడ్‌-19 బాధితులపై వినియోగించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే అత్యవసర అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది.

అమెరికా కేంద్రంగా ఉన్న మందుల తయారీ సంస్థ మైలాన్​, పాకిస్థాన్​లోని ఫిరోజ్​సన్స్​ ల్యాబొరేటరీస్​ కూడా గిలీడ్​తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు ఎక్కువ కాలం కొనసాగిస్తే భారత్​, పాక్​ దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీ స్థాయిలో డ్రగ్​ అందిచగలవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ..

'రెమిడెసివిర్' ఔషధంపై గిలీడ్‌ సైన్సెస్‌కు దాదాపు 70 దేశాల్లో 2,031 వరకు పేటెంట్లు ఉన్నాయి. అందువల్ల గిలీడ్‌ను కాదని ఇతర కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేయటం సాధ్యం కాదు. భాగస్వామ్యాలు కుదుర్చుకుంటేనే అది సాధ్యం. గతంలో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు కూడా, ఆ జబ్బును అదుపు చేసే ఔషధమైన 'ఒసెల్టామివిర్‌' ఔషధం తయారీకి గిలీడ్‌ సైన్సెస్...‌ మనదేశంలోని ఫార్మా కంపెనీలను 'వాలంటరీ లైసెన్స్‌' పద్ధతిలో భాగస్వాములగా చేసుకుంది. అదే పద్ధతిని ఇప్పుడు కూడా అనుసరిస్తోంది.

ఐసీఎంఆర్​ అనుమతి కావాలి?

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ (ఐసీఎంఆర్​) నుంచి అనుమతులు పొందిన వెంటనే హైదరాబాద్​లోనే ఈ మందు తయారు చేయనున్నట్లు హెటిరో సంస్థ ప్రకటించింది.

ప్రస్తుత ఒప్పందం ప్రకారం... సిప్లా సంస్థ యాక్టివ్​ ఫార్మాస్యూటికల్​ ఇంగ్రీడియంట్​(ఏపీఐ)ను తయారు చేసి, అంతిమ వస్తువును అదే బ్రాండ్​తోనే 127 దేశాల్లోని అమ్మకాలు జరపనుంది.

"మాకు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు, కొవిడ్‌-19 వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్న రెమిడెసివిర్‌తో రోగులు కోలుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేము క్లినికల్‌ పరీక్షలను దగ్గరగా పరిశీలిస్తున్నాం. అలాగే నియంత్రణ సంస్థల అనుమతులు పొంది, తొందర్లోనే ఈ ఔషధాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని జుబిలెంట్‌ లైఫ్‌ సెన్సెస్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

కరోనా వైరస్​ను కట్టడి చేస్తూ, బాధితులు వేగంగా కోలుకునేందుకు ఈ మందు సహాయపడుతుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.