ETV Bharat / business

డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ

author img

By

Published : May 26, 2021, 11:08 PM IST

Updated : May 27, 2021, 12:05 AM IST

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

Choksi
డొమినికా పోలీసులు అదుపులో చోక్సీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని డొమినికా పోలీసులు పట్టుకున్నారు. ఈ కుంభకోణం తరువాత చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయారు. అక్కడ నుంచి క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే చోక్సీపై ఇంటర్​పోల్​ నోటీసులు జారీ చేసింది.

ఇంటర్​పోల్​కు సంబంధించిన ఎల్లో నోటీసు జారీ చేసిన తరువాత డొమినికాలోని పోలీసులు మంగళవారం చోక్సీని పట్టుకున్నారు. ఆపై ఆయన్ని రాయల్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఆంటిగ్వా, బార్బుడాకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.

2018 నుంచి ఆ దేశ పౌరసత్వం పొందిన చోక్సీ అక్కడే నివసిస్తున్నట్లు ఆంటిగ్వా న్యూస్​ రూం తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ .13,500 కోట్ల రుణ మోసానికి పాల్పడిన చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించారు. ఆపై కారు దొరికిన అతను తప్పిపోయినట్లు సిబ్బంది వెల్లడించారు.

ఇదీ చూడండి: విందు కోసం వెళ్లి మెహుల్​ చోక్సీ అదృశ్యం

Last Updated : May 27, 2021, 12:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.