దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎల్పీజీ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తులకు భారీ స్థాయిలో డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇంధన వినియోగం రికార్డుస్థాయిలో 50శాతం మేర క్షీణించటం గమనార్హం.
ఏప్రిల్ 15 నాటికి భారత్లో పెట్రోల్ అమ్మకాలు 64 శాతం, డీజిల్ 61 శాతం మేర తగ్గినట్లు పరిశ్రమ గణాంకాలు తెలియజేశాయి. లాక్డౌన్తో విమానయాన సంస్థలూ మూసేయడం వల్ల ఏవియేషన్ టర్బైన్ ఇంధన(ఏటీఎఫ్) వినియోగం 94శాతం పడిపోయింది.
ఏప్రిల్ 1నుంచి 15 వరకు పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల వినియోగం 21శాతం పెంచినందున ఎల్పీజీ వృద్ధిబాటలో పయనించింది.
పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం గత ఏడాది పోలిస్తే..
కాలం | పెట్రోల్(టన్నుల్లో) | డీజిల్ (టన్నుల్లో) | ఏటీఎఫ్ (టన్నుల్లో) |
2019 ,ఏప్రిల్ | 2.4 మిలియన్లు | 7.3 మిలియన్లు | 6,45,000 |
2020 ,మార్చి | 2.15 మిలియన్లు | 5.65 మిలియన్లు | 4,84,000 |
- 2020 మార్చిలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 17.79 శాతం తగ్గి.. 16.8 మిలియన్ టన్నులకు చేరుకుంది.
- ఎల్పీజీ అమ్మకాలు 1.9 శాతం పెరిగి 2.3 మిలియన్ల టన్నులకు చేరింది.
ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, పరిశ్రమలతో పాటు ట్రక్కులకూ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించినందున.. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు