గాలి నాణ్యత దెబ్బతినడానికి అనేక కారణాలున్నా.. వాహన కాలుష్యం అన్నది అతిపెద్ద సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు అనేక కంపెనీలు... విద్యుత్ వాహనాల(ఈవీ) తయారీ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో ఈవీల వినియోగంపై ఇప్పుడిప్పుడే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. 2020లో ఎమ్జీ జెడ్ఎస్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
అధికారిక ప్రకటన ఇంతవరకు ఏమీ రాకపోయినప్పటికీ.. చాలా కంపెనీలు ఈ ఏడాదిలో మరిన్ని ఈవీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా, మహీంద్ర నుంచి మారుతీ వరకు వివిధ కార్ల తయారీ సంస్థలు తమ ఈవీలతో భారత మార్కెట్లలో ఈసారి పోటీ పడనున్నాయి. 2021లో విడుదల కానున్న కొన్ని ప్రముఖ సంస్థల విద్యుత్ కార్ల ఫీచర్లేంటో ఇప్పుడు చూసేద్దాం.
టాటా ఆల్ట్రోజ్ ఈవీ...
దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన ఆల్ట్రోస్ సిరీస్‌లో భాగంగా.. ఈసారి ఈవీని తీసుకురానుంది. త్వరలోనే దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంచ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ ఏడాది తొలిభాగంలోనే ఈ వాహనం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఫీచర్లు
- ఐపీ67 డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కి.మీ ప్రయాణ సామర్థ్యం
- ధర అంచనా- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు
ఆడి ఈ-ట్రాన్
విలాసవంతమైన కార్లకు పేరుగాంచిన కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి. 2021లో ఈ సంస్థ కూడా తన ఈవీని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భారత్‌లో సంస్థ ప్రతినిధి బల్బీర్ సింగ్ ధిలియన్ ఇంతుకుముందే ప్రకటించారు.
ఫీచర్లు..
- బ్యాటరీ సామర్థ్యం- 95కేడబ్ల్యూహెచ్
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ పైగా ప్రయాణించవచ్చు.
- ధర అంచనా- రూ.1.50 కోట్లు
-
Our #etron #family is growing: After the #Audi e-tron we have continued to expand our electric offensive. Take a look at how we live #eMobility >> pic.twitter.com/4iuBimqB3q
— Audi (@AudiOfficial) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our #etron #family is growing: After the #Audi e-tron we have continued to expand our electric offensive. Take a look at how we live #eMobility >> pic.twitter.com/4iuBimqB3q
— Audi (@AudiOfficial) December 23, 2020Our #etron #family is growing: After the #Audi e-tron we have continued to expand our electric offensive. Take a look at how we live #eMobility >> pic.twitter.com/4iuBimqB3q
— Audi (@AudiOfficial) December 23, 2020
-
మహీంద్ర ఈకేయూవీ 100
భారత మార్కెట్లలోకి.. మహీంద్ర ఈకేయూవీ 100 కారు.. ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఆటోఎక్స్‌పో 2020లో తొలిసారి ప్రదర్శించిన ఈ కారు.. అందరి మన్ననలను అందుకుంది.
ఫీచర్లు..
- బ్యాటరీ సామర్థ్యం- 15.9 కేడబ్ల్యూహెచ్
- వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం (గంట సేపట్లోనే 80శాతం బ్యాటరీ ఛార్జ్)
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 147కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
- ధర అంచనా- రూ.8.25లక్షలు
-
Mahindra is #DrivenByPurpose to innovate today for a better tomorrow. The eKUV100, India’s most affordable electric SUV is our endeavour to keep our roads cleaner. Join us at the Mahindra pavilion, Hall No.10-N2 #AutoExpo2020 to catch a glimpse of our EV range. pic.twitter.com/MdOtAwArAw
— Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mahindra is #DrivenByPurpose to innovate today for a better tomorrow. The eKUV100, India’s most affordable electric SUV is our endeavour to keep our roads cleaner. Join us at the Mahindra pavilion, Hall No.10-N2 #AutoExpo2020 to catch a glimpse of our EV range. pic.twitter.com/MdOtAwArAw
— Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2020Mahindra is #DrivenByPurpose to innovate today for a better tomorrow. The eKUV100, India’s most affordable electric SUV is our endeavour to keep our roads cleaner. Join us at the Mahindra pavilion, Hall No.10-N2 #AutoExpo2020 to catch a glimpse of our EV range. pic.twitter.com/MdOtAwArAw
— Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2020
-
మహీంద్ర ఎక్స్‌యూవీ 300 ఎలక్ట్రిక్
మహీంద్ర ఈకేయూవీ 100తో పాటు మహీంద్ర ఎక్స్‌యూవీ 300 మోడల్ ఎలక్ట్రిక్ కారును కూడా ఈ ఏడాది మహేంద్ర కంపెనీ తీసుకురానుంది.
ఫీచర్లు
- బ్యాటరీ సామర్థ్యం (కంపెనీ వెల్లడించలేదు.)
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 370కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
- ధర అంచనా.. రూ.18 లక్షలు
జాగ్వార్ ఐపేస్
ఎస్యూవీ కార్ల ఉత్పత్తి సంస్థ తన మొదటి ఈవీని ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా 2018లో విడుదలైన ఈ ఐపేస్ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఫీచర్లు..
- బ్యాటరీ సామర్థ్యం- 90 కేడబ్ల్యూహెచ్
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
- ధర అంచనా- రూ.కోటి
మారుతీ సుజుకీ వేగాన్ ఆర్‌ఈవీ
2021, సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ కంపెనీ తన వేగాన్ ఆర్‌ఈవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనుంది.
- వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం(40 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్ అవుతుంది)
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 200కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
- ధర అంచనా- రూ.9 లక్షలు
బజాజ్ ఆటో కూడా 2021లో విద్యుత్‌తో నడిచే.. త్రిచక్ర వాహనాన్ని తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
-
WagonR is safe like your home, outside of your own as it is thoughtfully engineered with energy absorbing chassis. #MakeEverydayGreat pic.twitter.com/5FnKht2ydp
— Maruti Suzuki WagonR (@Maruti_WagonR) May 15, 2017 " class="align-text-top noRightClick twitterSection" data="
">WagonR is safe like your home, outside of your own as it is thoughtfully engineered with energy absorbing chassis. #MakeEverydayGreat pic.twitter.com/5FnKht2ydp
— Maruti Suzuki WagonR (@Maruti_WagonR) May 15, 2017WagonR is safe like your home, outside of your own as it is thoughtfully engineered with energy absorbing chassis. #MakeEverydayGreat pic.twitter.com/5FnKht2ydp
— Maruti Suzuki WagonR (@Maruti_WagonR) May 15, 2017
ఇదీ చూడండి:'జియో టవర్లు ధ్వంసమైతే మాకేంటి సంబంధం'