ETV Bharat / business

డేటా అయిపోయిందా? ఛార్జీలు లేకుండా లోన్ తీసుకోండిలా.. - jio data loan number

డేటా లిమిట్ దాటిపోతే ఏం చేస్తాం? అదనంగా బూస్టర్లను రీచార్జ్ చేసుకుంటాం. కానీ సమయానికి డబ్బులు లేకపోతే...? డేటా లోన్ తీసుకునే సదుపాయం ఒకటి ఉందని మీకు తెలుసా?

JIO DATA LOAN
JIO DATA LOAN
author img

By

Published : Nov 7, 2021, 5:51 PM IST

మొబైల్​లో.. డెయిలీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం పడిపోతుంది. అవసరమైతే రీచార్జ్​ చేసుకొని డేటా బూస్టర్​లను ఉపయోగించుకోవచ్చు. అయితే, సమయానికి మన దగ్గర డబ్బులు లేకపోతే? ఏం చేయలేం..!

ఈ సమస్యకు పరిష్కారంగా జియో.. డేటా లోన్ (Data loan in Jio number)​ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ఎమర్జెన్సీ డేటాను యాక్టివేట్ చేసుకుంటే.. అదనంగా ఒక జీబీ డేటా మన ఖాతాలోకి వచ్చి చేరుతుంది. మరి ఎమర్జెన్సీ డేటా యాక్టివేట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

5 జీబీ డేటా

అవసరమైన సమయంలో రీచార్జ్ చేసుకొని.. తర్వాత చెల్లించే పద్ధతే ఇది. తీసుకున్న లోన్​ను (Jio data loan) ఎప్పుడు చెల్లించాలనేది పూర్తిగా యూజర్ల ఇష్టం. దీనికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఉండదు. మొత్తం ఐదు సార్లు లోన్ (Emergency Jio data loan) తీసుకునే అవకాశం ఉంది. అంటే ఐదు జీబీల డేటాను లోన్​ రూపంలో తీసుకోవచ్చు. ఒక్కో జీబీకి రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 5 జీబీలను ఉపయోగించుకుంటే రూ.55 తిరిగి చెల్లించాలి. రీపేమెంట్​ కోసం డెడ్​లైన్ లేకపోయినప్పటికీ.. జియో నుంచి ఎప్పటికప్పుడు రిమైండర్స్ వస్తుంటాయి. లోన్​ కోసం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

లోన్ ఇలా తీసుకోండి...

  1. ముందుగా మైజియో యాప్ ఓపెన్ చేయాలి. మెనూ సెక్షన్​పై క్లిక్ చేయాలి.
  2. మొబైల్ సర్వీసెస్ విభాగం కింద ఉన్న.. ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకొని.. 'ప్రొసీడ్' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  3. 'గెట్ ఎమర్జెన్సీ డేటా' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి.
  4. యాక్టివేట్ నౌ అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  5. ఎమర్జెన్సీ డేటా లోన్ యాక్టివేట్ అయిపోతుంది.

ఎన్నిసార్లు లోన్ తీసుకున్నారనే వివరాలు అదే సెక్షన్​లో కనిపిస్తాయి. తొలిసారి యాక్టివేట్ అవ్వగానే.. ఐదింటిలో ఒక డేటా బూస్టర్​ను వినియోగించినట్లు యాప్​లో చూపిస్తుంది. రీపేమెంట్ (Jio data loan how to pay) ఆప్షన్ ద్వారా లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు.

ఇదీ చదవండి: 15 రోజుల ట్రయల్​ ఆఫర్​తో స్మార్ట్​ఫోన్​.. నచ్చితే కంటిన్యూ.. లేదంటే రిటర్న్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.