ETV Bharat / business

ఫిబ్రవరిలోనూ ఎఫ్‌పీఐ పెట్టుబడుల జోరు

భారత వృద్ధిరేటుపై ఆర్థిక సంస్థలు, రేటింగ్​ ఏజెన్సీలు సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్​ఫోలియో మదుపరుల నుంచి పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు దాదాపు రూ.25 వేల కోట్ల ఎఫ్​పీఐల పెట్టుబడులు వచ్చినట్లు డిపాజిటరీస్​ డేటా తెలిపింది.

FPI inflow rise in Feb also
ఫిబ్రవరిలో పెరిగిన ఎఫ్​పీఐలు
author img

By

Published : Feb 22, 2021, 12:01 PM IST

భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. వీటిలో రూ.24,204 కోట్లు ఈక్విటీల్లోకి, రూ.761 కోట్లు డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. జనవరిలో ఎఫ్‌పీఐల ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి.

వృద్ధి రేటు అంచనాలే కారణం..

పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడం వల్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీఓఓ హర్ష జైన్‌ తెలిపారు. అలాగే బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక సంస్కరణలు మదుపర్లలో ఉత్సాహం నింపాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ఎస్‌.రంగనాథన్‌ తెలిపారు. డిజిటల్‌ రెవల్యూషన్‌ వైపు భారత్‌ అడుగులు వేసే దిశగా బడ్జెట్‌లో సంస్కరణలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో వచ్చే నెలలోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్​, తైవాన్​లలో మాత్రమే సానుకూలం..

ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో భారత్‌, తైవాన్‌ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎఫ్‌పీఐలను రాబట్టగలిగాయి. ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలోకి పెట్టేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ విధానాలను సరళీకరించే వరకు భారత్‌లోకి పెట్టుబడులు కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి:'స్ల్పింటర్​నెట్' దిశగా ఇంటర్నెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.